తాజా వార్తలు

Sunday, 13 September 2015

నోటి దుర్వాస అతి పెద్దసమస్య

ఇటీవల నోటి దుర్వాస అతి పెద్దసమస్య. నలుగురిలో నోరు తెరిచి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి… మనస్ఫూర్తిగా నవ్వలేని దుస్థితి… చివరికి.. భాగస్వామి దగ్గర కూడా నోరు తెరవడానికి బిడియపడే విషమ స్థితి… ఇలాంటి పరిస్థితులన్నింటి వెనుక ఉన్న ప్రబలమైన కారణం.. నోటి దుర్వాసన… హాలిటోసిస్. నోరంతా వాసనగా ఉంటోంది..  దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని, నోటిని నీటితో బాగా పుక్కిలించి కడుక్కున్నప్పుడు ఈ వాసన కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ఆ దుర్వాసన దీర్ఘకాలికమైన సమస్యగా పరిణమిస్తుంటుంది.నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోవడం వల్ల వారు ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో ఎక్కువగా నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం జరుగుతుంది. అందువల్ల నోటిలో లాలాజలం లేకుండా ఎండిపోవడం వల్ల నోటి దుర్వసనకు కారణం అవుతుంది.

మనం ఆహారం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఆహార పదార్థాలు ఈ బ్యాక్టీరియాకు పోషకాలుగా ఉపకరిస్తాయి. దాంతో ఇవి మరింతగా అభివృద్ధి చెందిన నోటి దుర్వాసనకు దోహదం చేస్తాయి. ఫలితంగా నోటి దుర్వాసన మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి నాలుకను టూత్ బ్రష్, మరియు టంగ్ క్లీనర్ తో రుద్ది శుభ్రం చేసుకుంటే దుర్వాసనను చాలామట్టుకు నివారించవచ్చు. అలాగే ఏదైనా తిన్న ప్రతి సారీ లేదా భోజనం తర్వాత మౌత్‌వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి. మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment