తాజా వార్తలు

Saturday, 12 September 2015

మధ్యప్రదేశ్ లో దారుణం, రెస్టారెంట్ లో పేలిన సిలిండర్..82మంది మృతి

మధ్యప్రదేశ్‌  జాబువాలోని సేతియా అనే రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో 82 మంది మృతి చెందారు. దాదాపు 85 మందికి గాయాలయ్యాయి. రెస్టారెంట్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మొదటి, రెండో అంతస్తులు కూలిపోయాయి. దీంతో రెస్టారెంట్లో ఉన్నవారిపై శిథిలాలు పడి ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. రెస్టారెంట్ భవనం కూలి పక్క భవనాలపై పడటంతో రెండు భవనాలు పక్కకు వంగిపోయాయి. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఎంపీ హోంమంత్రి బబూలాల్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment