తాజా వార్తలు

Wednesday, 30 September 2015

రామోజీతో జగన్ సమావేశానికి నాగార్జున మధ్యవర్తి అంట...???!


ప్రశాంతంగాఉన్న కొలనులోకి రాయి విసిరితే.. ఎంత గలాభా రేగుతుందో... రాష్ట్ర రాజకీయాల్లో రామోజీ, జగన్ ల మీటింగ్ కూడా అంతే గలాభాను రేపింది. ఈ మీటింగ్ పూర్వపరాల గురించి ఇంకా చర్చ ఆగిపోలేదు. ఉప్పూనిప్పుల్లాంటి వారి కలయిక వెనుక రీజన్లు.. హేతువుల గురించి చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలోకి ఇప్పుడు అక్కినేని నాగార్జున పేరు కూడా ఎంటరవ్వడం విశేషం. రామోజీ, జగన్ ల మీటింగ్ వెనుక నాగార్జున కూడా ముఖ్యపాత్ర పోషించాడనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాగూ నాగార్జున జగన్ కు క్లోజ్. మరో రకంగా చూసుకొంటే రామోజీకీ దగ్గరవాడే. ఈ నేపథ్యంలోనే నాగార్జున వీరిద్దరికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.
రామోజీతో జగన్ సమావేశానికి కొన్ని గంటల ముందు నాగార్జున వెళ్లి జగన్ తో సమావేశం కావడం కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడనే అభిప్రాయాలకు బలాన్ని చేకూరుస్తోంది. వీళ్ల మీటింగ్ ను ఒక కొలిక్కి తీసుకురావడంలో  ఆ విధంగానాగార్జున ముఖ్యపాత్రను పోషించాడనికి అవకాశం ఉంది.
అయినా నాగార్జునకు జగన్ వ్యవహారాల్లో మధ్య వర్తిత్వం చేయడం కొత్త కాదు. గతంలో ఉన్నట్టుండి నాగార్జున గుజరాత్ వెళ్లి.. నాటికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో ఉండిన నరేంద్రమోడీని కలవడం వెనుక కూడా జగన్ ఉన్నాడనేది వాస్తవం. అప్పట్లో జగన్ ప్రతినిధిగానే నాగ్ గుజరాత్ వెళ్లి మోడీని కలిశాడు.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే.. మద్దతు విషయంలో ఇరు వర్గాల మధ్య చర్చల కోసమే నాగార్జున వెళ్లాడనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే .. సంకీర్ణం అవసరం లేకుండా పోయింది. మరి అప్పట్లో అలా మధ్యవర్తిత్వం చేసిన నాగ్ ఇప్పుడు రామోజీ తో చర్చల విషయంలో కూడా మధ్యవర్తిత్వం చేసి ఉండే అవకాశాలుండవచ్చు కూడా!
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment