తాజా వార్తలు

Saturday, 19 September 2015

సెట్లో అసలు పని ఎగ్గొట్టి లవ్‌ పని చేస్తున్న నయనతార
సినిమా అంటేనే బోలెడంత టైం తీసుకునే జాబ్‌. అలాంటి టైంలో పని మీదే ధ్యాస ఉండాలి తప్ప. సొంత పైత్యం ప్రదర్శించుకూడదు. వృధాగా టైం ఖర్చవుతుంటే నిర్మాతకు ఎంతో టెన్షన్‌గా ఉంటుంది. హీరోయిన్‌ నయనతార కూడా తన సొంత వ్యవహారంతో నిర్మాత ధనుష్‌కు విపరీతమైన కోపం తెప్పిస్తుందట.  వివరాల్లోకి వెళితే రజనీ కాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మాతగా తమిళంలో నిర్మిస్తున్న ఓ సినిమాకు విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. సేతుపతి హీరో, నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక దర్శకుడు విఘ్నేష్‌తో నయనతారకు ఎఫైర్‌ ఉండడం వల్ల సెట్లో అసలు పని ఎగ్గొట్టి, తమ లవ్‌ గొడవలో మునిగిపోతూ రోజుకు అతి తక్కువ సీన్లు తీస్తుండటంతో ధనుష్‌కు ఒళ్లు మండిపోయి ఇద్దరికీ వార్నింగ్‌ ఇచ్చేశాడట.  మీకు చెప్పాల్సిన సంగతి కాదు. ఇలా టైం వేస్ట్‌ చేస్తే ఎంత ఖర్చు వేస్టవుతుంది. మీకు ఏదైనా పర్సనల్స్‌ ఉంటే బయట చూసుకోండి. ఇలా సెట్లో కాదు అని మొహమాటం మొహమ్మీదే చేప్పేయడంతో నయనతార నొచ్చుకుందట. వెంటనే ఐశ్వర్య (ధనుష్‌ భార్య) రంగంలోకి దిగి నయనతారను జోకొట్టిందట. ప్రేమ వేరు.. బిజినెస్‌ వేరు కదా.. సెట్లో ప్రేమించుకోవడం ఎందుకు. షూటింగ్‌ అయిపోయాక తెల్లారే వరకూ మీ ఇష్టం కదా అంటూ నచ్చచెప్పడంతో నయనతార కూల్‌ అయ్యిందట.
« PREV
NEXT »

No comments

Post a Comment