తాజా వార్తలు

Monday, 21 September 2015

నేపాల్ లో కొత్త రాజ్యాంగం, నిరసనలు

నేపాల్ లో ఇప్పుడు కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నిరనసలు, కుదరని ఏకాభిప్రాయం మధ్య కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు రాం బరణ్ యాదవ్ ఖాట్మండులో ప్రకటించారు. నేటి నుంచీ నేపాల్ పూర్తి ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడం.., కొత్త రాజ్యాంగంలో తమకు ప్రాతినిథ్యం లేదంటూ భారత మూలాలున్న మధేశీలు, థారూ తెగల ప్రజలు నిరసనలకు దిగుతుండడంతో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. నేపాల్ కొత్త రాజ్యాంగంపై ఎడతెగని నిరసనలు కొనసాగుతూ వచ్చాయి. తమకు ప్రాధాన్యం లేదంటూ కొన్ని వర్గాలు ఆందోళనలకు దిగడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గత వారం రోజుల్లో పోలీసుల కాల్పుల్లో 40 మంది పౌరులు మృతి చెందారు. నేపాల్ కొత్త రాజ్యాంగం రూపకల్పనకు ఏడేళ్లుగా కసరత్తు చేశారు. చివరకు ఓ కొలిక్కి తెచ్చారు. దాంతో ఆదివారం రోజున కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. మధ్యలో కొన్ని అంశాలు ప్రజల మధ్య తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హిందూ దేశంగా ఉండాలని కొందరు.. లౌకిక దేశంగా మారాలన్న మరికొందరి ప్రతిపాదనలతో హీట్ పెరిగింది. చివరకు సరికొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా చివరకు సెక్యులర్ నేపాల్ గా అవతరించింది. కొత్త రాజ్యాంగంలో తమకు ప్రాతినిధ్యం లేదంటూ భారత మూలాలున్న మధేశీలు, థారూ తెగల ప్రజలు నిరసనలకు దిగారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment