తాజా వార్తలు

Monday, 21 September 2015

నేతాజీ ఫ్యామిలీని కలువనున్న మోడీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. వచ్చే నెలలో నేతాజీ కుటుంబానికి చెందిన 50 మంది సభ్యులు ప్రధానిని ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ ఏడాది మే లో ప్రధాని…కోల్‌కతా పర్యటనలో సుభాష్ చంద్రబోస్‌ కుటుంబసభ్యులను కలిశారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో ఉన్న నేతాజీ కుటుంబ సభ్యులు అందరూ కలవాలని ప్రధాని కోరారు. దీనికి నేతాజీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఇలాంటి అరుదైన అవకాశం లభించటం ఎంతో అదృష్టమని ప్రధాని తెలిపారు. గతంలో ఏ ప్రధానికి కూడా ఇలాంటి అవకాశం లభించలేదని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని వెల్లడించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment