తాజా వార్తలు

Friday, 25 September 2015

హీరోయిన్ గా మెగా యాంకరమ్మ?

హీరోయిన్ గా మెగా యాంకరమ్మ రాబొతున్నది. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాత గా రామరాజు దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య సరసన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. గతంలో "మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు " వంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామరాజు ఈ చిత్రానికి ఓ కొత్త కథనం తో మరో ప్రేమ కథను మనకి అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రామరాజు చాలా అద్భుతమైన కథను అందించారు, హీరో నాగ శౌర్య తో పాటు హీరోయిన్ గా మెగా ఫ్యామిలి వారసురాలు కొణిదెల నిహారిక వెండితెరకు పరిచయం కాబోతుంది. ఈ చిత్రానికి A. అభినయ్, డా. కృష్ణ భట్ట సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేస్తారు
« PREV
NEXT »

No comments

Post a Comment