తాజా వార్తలు

Saturday, 26 September 2015

నిత్యా సీత కన్ను వేసింది...!
రింగులజుత్తు సోయగం నిత్యామీనన్ ఇటీవలి కాలంలో బొత్తిగా నల్లపూస అయిపోయింది. టాలీవుడ్ లో అస్సలు కనిపించడం లేదు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సన్నాఫ్ సత్యమూర్తి ఓకే బంగారం సినిమాల తర్వాత ఈ  అమ్మడి జాడైనా కనిపించలేదు. దాంతో నిత్యా అభిమానులంతా బెంగ  పెట్టుకున్నారు. ఎట్టకేలకు బెంగ తీర్చేందుకు నిత్యా రెడీ అవుతోంది. అయితే ఈసారి నేరుగా తెలుగు సినిమాతో కాదు ఓ అనువాద చిత్రంతో అభిమానుల ముందుకొస్తోంది.

ఒకే బంగారం వంటి క్లాసిక్ హిట్ లో తనకి జోడీగా నటించిన దుల్కార్ సల్మాన్ ఈ చిత్రంలో హీరో. నిత్యా-దుల్కార్ కాంబినేషన్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీ ఇది. ఉస్తాద్ హోటల్ పేరుతో గతంలో మలయాళంలో రిలీజై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ఓ చిన్ని ప్రేమకథ మరో హోటల్ కథ.. మల్లూ బాబులకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా.. ''జతగా'' పేరుతో తెలుగులో డబ్బింగ్ అవుతోంది. కంటెంట్ ఏదైనా.. మరోసారి నిత్యా అభిమానులకు పండుగ వచ్చినట్టే.

టాలీవుడ్ లో వరుసగా విజయాలు అందుకున్నా.. ఎందుకనో మన పరిశ్రమపై నిత్యా సీత కన్ను వేసింది. ఇక్కడ కమర్షియాలిటీ తనకి నచ్చలేదో.. లేదా ఈ అమ్మడు అంటే మన దర్శకనిర్మాతలేమైనా ముఖం చాటేస్తున్నారా? అన్నది అర్థం కాని పరిస్థితి. ఎలానూ తన సినిమా ప్రమోషన్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సంగతి ఏంటో అడిగేయాలి.
Filmdesk
« PREV
NEXT »

No comments

Post a Comment