తాజా వార్తలు

Tuesday, 15 September 2015

ఎన్టీఆర్ డబుల్స్మళ్లీ మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ కలిగించే వార్త ఇది. బివివిఎస్ఎన్ ప్రసాద్-సుకుమార్ దర్శకత్వంలో నిర్మించే సినిమా లో హీరో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన గెటప్ అంతా ఒక క్యారెక్టర్ ది మాత్రమే నంట. రెండో క్యారెక్టర్ కు గడ్డం వుండదంట. ఇద్దరు అన్నదమ్ములుగా వుండే క్యారెక్టర్లు సుకుమార్ తయారుచేసాడని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజం అన్నది ఇంకా పక్కాగా తెలియాల్సి వుంది కానీ, వార్త అయితే టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అందువల్ల నిజమే అనుకోవాలి.
అదే అయితే ఇక జూనియర్ అభిమానులకు పండగే. గతంలో వివి వినాయక్ డైరక్షన్ లో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చేసిన డబుల్ రోల్ గుర్తుందిగా..చించి ఆరేసాడు. అభిమానులు కాసులు కురిపించారు. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ రిపీట్ అవుతుందేమో?
« PREV
NEXT »

No comments

Post a Comment