తాజా వార్తలు

Wednesday, 30 September 2015

ఎన్టీఆర్ తో కాకుండా అఖిల్ తో సినిమా చెస్తానంటున్న కొరటాల శివ ...!!!ఎందుకో తెలియదు కానీ, పైకి చెప్పడం లేదు కానీ, దర్శకుడు కొరటాల శివ కు ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో సినిమా చేయడంపై అంత ఆసక్తి లేదని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ మైత్రీమూవీస్ నిర్మాతలు మాత్రం ఎన్టీఆర్ తో కొరటాల కాంబినేషన్ సెట్ చేయాలని చూస్తున్నారు.
గతంలో వెల్లడించినట్లే, ఈసారి కాస్త డిఫరెంట్ జోనర్ ట్రయ్ చేయాలని కొరటాల భావిస్తున్నారు. దానికి అఖిల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే 22న ఎన్టీఆర్ సినిమా పూజ వ్యవహారంపై ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ లేదని, 15న అమెరికా నుంచి కొరటాల శివ వచ్చిన తరువాతే ఈ విషయం ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో  తన సినిమా పూజ తేదీపై వెలువడిన వార్తలు చూసిన శివ సన్నిహితులు ఆయనను సంప్రదించినపుడు, అదేం ఇంకా ఫైనల్ కాలేదు అనే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శివతో ఎలాగైనా సినిమా చేయాలనే ఎన్టీఆర్ పట్టుదలగా వున్నట్లు వినికిడి.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment