తాజా వార్తలు

Tuesday, 29 September 2015

థాంక్స్ ఒబామా- ప్రధాని మోడీ

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి అండగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. భద్రత, ఆర్థిక, వాణిజ్య సంబంధాలతోపాటు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, వాతావరణ మార్పులపై పోరాటానికి కలిసిమెలిసి ముందడుగేద్దామని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలకు భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. త్వరలో ఫ్రాన్స్‌లో వాతావరణ మార్పులపై జరుగనున్న సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగేందుకు సహకరించుకోవాలని సూచించారు. అమెరికాలో ఆరు రోజుల పర్యటనలో ఉన్న మోదీ న్యూయార్క్‌లో  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వరుస భేటీలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్రవాదం, వాతావరణ మార్పులపైనే వీరిమధ్య చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీలో భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చ జరిగింది. ధనిక, పేదదేశాల మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో వాతావరణ మార్పులను నివారించే ఒప్పందంపై ప్యారిస్ సమ్మిట్‌లో భారత్ నాయకత్వంలో కీలక నిర్ణయాలు జరుగాలని ఒబామా ఆకాంక్షించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment