తాజా వార్తలు

Saturday, 5 September 2015

ఫలించిన మాజీ సైనికుల పోరాటం

మాజీ సైనికుల పోరాటం ఫలించింది. ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాజీ సైనికుల 42 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దీనిపై ఢిల్లీలో అధికారిక ప్రకటన చేశారు. విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. అయితే, ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానం అమలు చేయడానికి ఏడాదికి రూ. 8 వేల కోట్ల భారం పడుతుందని పారికర్ వివరించారు. ఐదేళ్లకోసారి ఈ విధానాన్ని సమీక్షిస్తామని చెప్పారు. జులై 1, 2014 నుంచి ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానం అమలు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎరియర్స్ నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. వితంతువులకు మాత్రం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కు ప్రధాని పలుమార్లు హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రకటనతో మాజీ నైనికులు ఆనందం వ్యక్తంచేస్తున్నరు.    
« PREV
NEXT »

No comments

Post a Comment