తాజా వార్తలు

Saturday, 26 September 2015

రఘునాథ రెడ్డిని తప్పించడానికే కట్టుబడి ఉన్న బాబు...!గత రెండు మూడు రోజులుగా మాటల దాడిని మరింత తీవ్రం చేశాడు పల్లె రఘునాథరెడ్డి. జగన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నాడీయన. అది కూడా ప్రత్యేకహోదా అంశం గురించి జగన్ దీక్ష అంటుండే సరికి రఘునాథరెడ్డి కి మంచి అవకాశం దొరికింది. జగన్ పై ఇష్టానుసారం పేట్రేగిపోతున్నాడు. జగన్ కు ప్రత్యేకహోదా అంశం గురించి మాట్లాడే అర్హత లేదని.. ఆయనకు చిత్తశుద్ధి లేదని.. అవగాహన లేదని... ఇలా ఏదేదో మాట్లాడుతూ... జగన్ అవినీతి పరుడు అనే దగ్గరకు వచ్చి... దుమ్మెత్తిపోస్తున్నాడు రఘునాథరెడ్డి. అంతే కాదు.. ఐటీ శాఖ మంత్రి హోదాలో కూడా పాత హామీలను మరోసారి రిపీట్ చేస్తున్నాడు. ఐదారు లక్షల ఉద్యోగాలు అంటూ .. హామీలు ఇస్తున్నాడు. ఏడాది నుంచి చెబుతున్న మాటనే మరోసారి రిపీట్ చేశాడు. తద్వారా ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి తనవంతు యత్నాలు చేస్తున్నానని ఈయన బాబు దగ్గర నిరూపించుకుంటున్నాడు. 
ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా... పాపం రఘునాథరెడ్డి పదవి అయితే నిలబడటం కష్టమే అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రఘునాథరెడ్డి ని తప్పించడం ఖాయం అయ్యింది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో రఘునాథ రెడ్డిని తప్పించడానికే బాబు కట్టుబడి ఉన్నారని ప్రభుత్వంలోని వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ విషయం గురించి స్పష్టత వచ్చిన తర్వాతే తన అంతిమ ప్రయత్నాలుగా జగన్ పై రఘునాథరెడ్డి దుమ్మెత్తిపోస్తున్నాడు.. ఐదు లక్షల ఉద్యోగాల ని చెప్పుకొస్తున్నాడు. వీటిని విని అయినా అధినేత కరుణించక పోతాడా.. అని ఆయన ఆశ. అయితే ఆ అవకాశం లేదని సమాచారం. ఏ తప్పూ చేయకపోయానా.. తన వంతుగా చేయగలిగింది చేస్తున్నా.. రఘునాథరెడ్డికి మాత్రం బాబు అవకాశం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.అనంతపురం జిల్లాకు చెందిన తన సామాజికవర్గానికి ప్రాధాన్యతను ఇవ్వడంలో భాగంగా రఘునాథరెడ్డిని ఇంటికి పంపడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
Newsdesk
« PREV
NEXT »

No comments

Post a Comment