తాజా వార్తలు

Wednesday, 9 September 2015

పరిటాల అనుచరుడా మజాకానా!!!
ఒక ఐపీఎస్ అధికారి.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. 1994 నుంచి 2004ల మధ్య తన వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలిచారు కూడా. తెలుగుదేశం నేత పరిటాల రవికి బాగా దగ్గర అనే పేరు ను తెచ్చుకొన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతల అణిచివేత కార్యక్రమంలో ఆ ఐపీఎస్ అధికారి దూసుకుపోయారు. దాదాపు పదేళ్లలో పడిన శ్రమ ఏదైనా ఉంది అంటే... అది కాంగ్రెస్ వాళ్లను అణిచివేయడంలో మాత్రమే. మొదటగా  ఏఎస్పీగా.. తర్వాత ఎస్పీగా ఆ అధికారి వీర విజృంభణ కొనసాగింది. ఏఎస్పీగా  పనితీరు ను మెచ్చుకొని ఎస్పీగా కూడా  తెచ్చుకొన్నారు తెలుగుదేశం నేతలు. ఒక దశలో తెలుగుదేశం నేతలపై ఆ అధికారి భక్తి పెరిగిపోయి.. కాంగ్రెస్ నేతలతో డైరెక్టుగా తలపడే వరకూ వచ్చింది పరిస్థితి. ఒక కాంగ్రెస్ నేతతో ఆ అధికారి రోడ్డుపై తలపడ్డారు. కిందా మీద పడి గొడవ పడ్డారు. రోడ్లుపై దొర్లారు. ఉన్నత చదువులు చదివిన ఆ అధికారి అలా ప్రవర్తించడం.. అధికార పార్టీకి బానిసగా వ్యవహరించడం అప్పట్లో వివాదం అయ్యింది. మరి 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. కథ మారిపోయింది. ఆ అధికారిని శంకరగిరి మన్యాలు పట్టించారు  కాంగ్రెస్ వాళ్లు. పరిటాల రవికి రైట్ హ్యాండ్ లా మారిపోయిన తనను పదేళ్ల పాటు మీడియాలో కనిపించకుండ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష యుగం ముగిసిపోయిన తర్వాత ఆ అధికారికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి!  ప్రమోషన్ల మీద ప్రమోషన్లు.. అదనపు ప్రమోషన్లు దక్కుతున్నాయి. జిల్లాల స్థాయి ని దాటి వచ్చి.. రాష్ట్ర స్థాయి పోలీసుగా వెలుగొందుతున్నారు ఆ అధికారి. మరి ఇదంతా.. అప్పట్లో చేసిన సేవలకు ప్రతిఫలమే! ఇప్పుడు పాత పరిచయాలతో ఆ అధికారి మళ్లీ ఉన్నత స్థాయిలను అందిపుచ్చుకొంటున్నారు. అధికారం చేతులు మారడటంతో కేవలం నేతలకే కాదు.. అధికారులకు కూడా ఇలాంటి ప్రయోజనాలు దక్కుతుండటం విశేషమే.  
« PREV
NEXT »

No comments

Post a Comment