తాజా వార్తలు

Monday, 21 September 2015

కూలిన పోలవరం కల్వర్టర్

పశ్చిమగోదావరి జిల్లా పేదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడి కాలువపై నిర్మించిన కల్వర్టరు కూలిపోయింది. పట్టిసీమ ప్రాజెక్టుని మొదటి నుంచి విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. ఈ ఘటనతో మరిత వాయిస్ పెంచాయి. కల్ వర్టరు కూలిపోవడంతో గండి పడి, గోదావరి నీరు వృధాగా కోల్లేరు పాలవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. . ఈనెల 8న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్ వర్టర్అప్పుడే కూలిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయడానికి వచ్చే ఏడాది వరకు సమయం ఉన్నా.. హడావిడిగా పూర్తి చేయడం వల్లే ఈ పరిస్తితి వచ్చిందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. కల్ వర్టర్ కూలిపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment