తాజా వార్తలు

Tuesday, 8 September 2015

కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్ కు పదవీగండం-పొన్నం ప్రభాకర్

"రోమ్‌ నగరం తగలబడుతుంటే... ఆ దేశ రాజు ఫిడేల్‌ వాయించినట్టు’’గా.. దాన్ని మరిపించే రీతిలో సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. ఒక వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ చైనా పర్యటనకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కు అల్లుడి రూపంలో పదవీ గండం పొంచి ఉందని టీకాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాను చైనా పర్యటన నుంచి తిరిగొచ్చేసరికి అల్లుడో, కొడుకో, కూతురో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలగొడుతారనే భయంతోనే  అసెంబ్లీ స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌లను కేసీఆర్‌ తనతోపాటు తీసుకెళ్లారని పొన్నం విమర్శించారు
« PREV
NEXT »

No comments

Post a Comment