తాజా వార్తలు

Wednesday, 16 September 2015

పోప్ ఫ్రాన్సిస్ హత్యకు స్కెచ్ వేసిన ఐస్ ఐఎస్ ?

పోప్ ఫ్రాన్సిస్ హత్యకు ఐస్ ఐఎస్ ఉగ్రవాద సంస్థ స్కెచ్ వేసిందనే వార్త అమెరికాలో కలకలం రేపుతున్నాయి. ఐసిస్ కుట్రదారు అనే అనుమానంతో అమెరికాలో ఇటీవల ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఇంటరాగేట్ చేయగా ఈ విషయం బయటపడింది. ఈ నెల 22 నుంచి 27 వరకు అమెరికాలో పోప్ పర్యటించబోతున్నారు. ఫిలడెల్ఫియాలో పోప్ పాల్గొనే కార్యక్రమంలో దాడి చేయాలని ఐసిస్ ప్లాన్ వేసిందట.  పోప్ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరపాలనే కుట్ర,పోలీసుల అప్రమత్తత వల్ల ముందే బహిర్గతమైంది. దీంతో అమెరికాలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోప్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment