తాజా వార్తలు

Saturday, 19 September 2015

అల్లు అరవింద్, సినిమా సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చిన ప్రభాస్!!!యువి క్రియేషన్స్ అంటేనే ప్రభాస్ ఇంటి బ్యానర్ లాంటిది. ఫ్రభాస్ తండ్రి పేరు ముందు కూడా యువి అనే వుంటుంది. ఇంతవరకు ఈ బ్యానర్ అన్నీ మంచి టాక్ వచ్చిన సినిమాలన్నీ మంచి టాక్ ను, పేరును, పైసలను తెచ్చుకున్నవే. ఒక్క జిల్ మాత్రమే కాస్త ఓవర్ బడ్జెట్ అయింది.  లేటెస్ట్ గా భలే భలే మగాడివోయ్ సినిమా పెద్ద హిట్ అయింది. మంచి న్యూస్ వుంటే చాలు బంధువులతో కలిసి పార్టీ చేసుకోవడం ప్రభాస్ కు అలవాటు. అందుకే కొద్ది రోజుల క్రితం బంధువులను పిలిచి మాంచి పార్టీ ఇచ్చాడు. ముందు రోజు అల్లు అరవింద్, సినిమా సెలబ్రిటీలను పిలిచి పార్టీ ఇస్తే, మర్నాడు ప్రభాస్ బంధువులకు పార్టీ ఇచ్చాడు.  రెండు పార్టీలకు స్పెషల్ అప్పీరియన్స్..భళ్లాలదేవ..రానానే.  ముందు రోజు అరవింద్ పార్టీలో సినిమా జనాలతో కలిసి ఎంజాయ్ చేస్తే, మర్నాడు బంధువులతో కలిసి సరదాగా గడిపాడు ప్రభాస్
« PREV
NEXT »

No comments

Post a Comment