తాజా వార్తలు

Tuesday, 8 September 2015

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లె గ్రామం దశ మార్చిన ప్రకాష్‌రాజ్‌...
సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ తెలంగాణలో తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లె గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమైన ప్రకాష్‌రాజ్‌, గ్రామంలో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న విషయమై గ్రామస్తులతో ప్రకాష్‌రాజ్‌ చర్చించారు.  గ్రామంలో పర్యటిస్తున్నది నాయకుడినైపోదామని కాదు.. గ్రామానికి తాను ఏమేం చేయగలనో తెలుసుకోవడానికే గ్రామంలో పర్యటిస్తున్నట్లు ప్రకాష్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. కొండారెడ్డిపల్లి గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు ప్రకాష్‌రాజ్‌ చెప్పారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రముఖులు గ్రామాల్ని దత్తత తీసుకోవాలంటూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన ప్రకాష్‌రాజ్‌ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు మంత్రి కేటీఆర్‌ని కలిసిన తర్వాత ప్రకటించారు.  నిన్న కేసీఆర్‌ని ప్రకాష్‌రాజ్‌ కలవడం, ఈ రోజు కొండారెడ్డిపల్లిలో ప్రకాష్‌రాజ్‌ పర్యటించడంతో.. కొండారెడ్డిపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం అభివృద్ధికి సహకరిస్తానని ముందుకొచ్చిన ప్రకాష్‌రాజ్‌కి కొండారెడ్డి పల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
« PREV
NEXT »

No comments

Post a Comment