తాజా వార్తలు

Friday, 4 September 2015

విద్యార్థులకు పాఠాలు చెప్పిన రాష్ట్రపతి

ఉపాద్యాయదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ టీచర్ అవతారమెత్తారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలోని పాఠశాల విద్యార్ధులకు పొలిటికల్ హిస్టరీ పాఠాలు చెప్పారు. తన చిన్ననాటి చిలిపి పనులను, సుధీర్ఘ అనుభవాలను విద్యార్ధులతో పంచుకున్నారు. చదువుకునేందుకు రోజూ ఐదు కిలో మీటర్లు నడిచి వెళ్లే వాడినని, చిన్నతనంలో చాలా అల్లరి పిల్లాడినన్నారు. తాను యావరేజ్ స్టూడెంట్ నే అని, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన వాడినే అన్నారు. అంతేకాదు తనను ముఖర్జీ సర్ అని పిలవాలని, ఎవైనా సందేహాలు ఉంటే నిస్సోకచంగా అడగాలని విద్యార్ధులకు చెప్పారు. భారత రాజ్యాంగం గురించి కూడా విద్యార్ధులకు వివరించిన ప్రణబ్.. ప్రజాస్వామ్యం అనేది సామాన్యులకు దొరికిన వరమన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment