తాజా వార్తలు

Saturday, 26 September 2015

అల్లు అర్జున్ తో ప్రియమణి ఐటెమ్ సాంగ్?

ప్రియమణి తాజాగా ఓ ప్రత్యేక గీతంలో నర్తించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. గతంలో షారుఖ్‌ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ప్రియమణి ప్రత్యేక ఐటమ్ సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే. 
అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నరు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం ఇటీవలే దర్శకుడు బోయపాటి హీరోయిన్ ప్రియమణిని సంప్రదించాడని, పాట నచ్చి ఆమె ఇందులో నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. కొంత విరామం తరువాత ప్రియమణి చేయబోతున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment