తాజా వార్తలు

Tuesday, 29 September 2015

బాలీవుడ్ యూత్ క్రేజీ స్టార్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌కు రామ్‌చ‌ర‌ణ్ బిర్యానీ వండించి పెట్టాడు
దిల్‌వాలే షూటింగ్ కోసం హైద‌రాబాద్‌లో ఉన్న బాలీవుడ్ యూత్ క్రేజీ స్టార్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌కు రామ్‌చ‌ర‌ణ్ ఆహ్వానం అందించాడు. త‌న ఇంటికి పిలిచి, చ‌క్కని బిర్యానీ వండించి పెట్టి ఆనంద‌ప‌రిచాడు. దీంతో ఉబ్బి త‌బ్బిబ్బయిన వ‌రుణ్‌, ట్విట్టర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు కృత‌జ్ఞత‌లు తెలిపాడు. అద్భుత‌మైన లంచ్‌ను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. టాలీవుడ్ హీరో హోమ్‌ఫుడ్ కూడా అద‌ర‌హో అన్నాడు

ఇప్పటిదాకా హైద‌రాబాద్‌లో చాలా బాలీవుడ్ సినిమాలు షూటింగ్ చేసుకున్నాయి. ప‌లువురు స్టార్లు స‌ద‌రు సినిమాల కోసం హైద‌రాబాద్‌లో రోజుల త‌ర‌బ‌డి మ‌కాం పెట్టిన దాఖ‌లాలూ ఉన్నాయి. అయితే... దిల్‌వాలే సినిమా షూటింగ్ సంద‌ర్భంగా మాత్రం అరుదైన క‌ల‌యిక‌లు, అబ్బుర‌ప‌రిచే ఆతిధ్యాలు చోటుచేసుకుంటున్నాయి

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment