తాజా వార్తలు

Wednesday, 9 September 2015

రాణి ముఖర్జీ కి ముద్దు అంటే చేదు అంట
ఎంతయినా మనం భారతీయులం. మన పద్ధతులు మనకు వున్నాయి. విదేశీయులతో మనం పోల్చుకోలేం. ఇక్కడ పద్ధతులు ఎంతో సంస్కారవంతమైనవి. విదేశీయులు కొన్ని విసయాల్లో మన నుండి ఎంతో నేర్చుకోవాలి.. అంటుంది హిందీ హీరోయిన్‌ రాణి ముఖర్జీ. గతంలో మనం వాళ్ళ నుంచినేర్చుకోవాలని తాపత్రయపడేవాళ్ళం. ముఖ్యంగా విచ్చలవిడి శృంగారం అనేది మనకు నచ్చని విషయం. వాళ్ళు నడుస్తూ ముద్దులు పెట్టుకుంటూ పోతారు.  పార్కుల్లో, రోడ్ల పక్కన చుంబనాలే చుంబనాలు. అవన్నీ అక్కడ చెల్లుతాయి. ఇక్కడ పిల్లలు, పెద్దలూ వుంటారు. వాటిని చూసి షాక్‌ అవుతారు. శృంగారం అనేది జంతువుల్లా పబ్లిక్‌గా చేసుకునేది కాదు. నాలుగు గోడల మధ్య జరిగేది. దాన్ని బహిరంగంగా ప్రోత్సహించడాన్ని నేను సహించను. మనలో చాలామంది విదేశాలకు హనీమూన్‌కి వెళతారు. కానీ అక్కడ నేర్చుకునేది ఏమీ వుండదు. వాళ్ళకులాగా మనం రోడ్ల మీద ముద్దులు పెట్టుకోలేం కదా.. అని ప్రశ్నిస్తోంది రాణి ముఖర్జీ.
« PREV
NEXT »

No comments

Post a Comment