తాజా వార్తలు

Tuesday, 8 September 2015

రేవంత్ రెడ్డి తొ కేసిఆర్ ప్రభుత్వం కి తిప్పలు తప్పవా..
ఓటుకి నోటు వ్యవహారంలో పక్కాగా దొరికి నెలరోజుల పాటు చర్లపల్లి జైలులో ఉన్న టిడిపి ఎం ఎల్ ఏ రేవంత్ రెడ్డి కి హై కోర్టు ఆంక్షలను సడలించింది . జైలులో ఉన్న సమయంలో షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేయడమే కాకుండా కోడంగల్ నియోజకవర్గం పరిది దాటి రావద్దని ఆంక్షలు జారీ చేసిన హై కోర్టు తాజాగా ఆ ఆంక్షలను పక్కన పెట్టి రేవంత్ ని ఫ్రీ బర్డ్ ని చేసింది . ఇకనుండి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అయితే ప్రతీ సోమవారం మాత్రం ఏ సిబి కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి రావాల్సిందిగా ఆదేశించింది . దీంతో రేవంత్ కేసిఆర్ ప్రభుత్వం పై పోరాటం చేయడం ఖాయమని అలాగే హైదరాబాద్ నుండి పోరాట పంథాని ఎంచుకుంటా రని వాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తారని అంటున్నారు రేవంత్ అభిమానులు . 
« PREV
NEXT »

No comments

Post a Comment