తాజా వార్తలు

Wednesday, 9 September 2015

రేవంత్‌రెడ్డి స్వభావమే అంతఆయన మారడు.. మారితే రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు.? ఓ ఎమ్మెల్యేని 50 లక్షలకు ప్రలోభ పెడుతూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాక కూడా హీరోయిజం ప్రదర్శించడం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మాత్రమే చెల్లింది. సింహం సింగిల్‌గా వస్తుంది.. అంటూ ఎడా పెడా డైలాగులు పేల్చేశారు. బెయిల్‌ షరతుల సడలింపబడ్డాక తొలిసారి హైద్రాబాద్‌కి వచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  కాస్త వెనక్కి వెళితే, గతంలో షరతులతో కూడిన బెయిల్‌ వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు ఏకంగా భారీ ర్యాలీనే చేపట్టిన విషయం ఎలా మర్చిపోగలం. ఆ సమయంలో అభిమానులు బహూకరించిన కత్తిని చేతబూనారు.. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు దంచేశారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు. అప్పుడే అంత హంగామా చేస్తే, బెయిల్‌ షరతులు సడలించబడిన తర్వాత ఆయన కామ్‌గా వుంటారని ఎలా అనుకోగలం.?  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన కోసం వెళితే, తాను వస్తున్నానని తెలిసే విమానమెక్కి పారిపోయాడంటూ సెటైర్లు వేయడం రేవంత్‌రెడ్డి అవివేకానికి పరాకాష్ట. ఆట కాదు, వేట మొదలయ్యిందని రేవంత్‌రెడ్డి చెబుతోంటే టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఓటుకు నోటు కేసు కన్నా ఆట, వేట ఏముంటాయో ఆయనకే తెలియాలి.  మొత్తమ్మీద, రేవంత్‌రెడ్డి ఏమాత్రం మారలేదు. ఈ దుందుడుకు స్వభావమే రాజకీయాల్లో ఇంకెవరి మీదా పడని అతి పెద్ద మచ్చ ఆయన మీద పడేలా చేసింది. అయినా, రేవంత్‌రెడ్డి మారలేదంటే, ఆయన ఇంక మారడుగాక మారడంతే.
« PREV
NEXT »

No comments

Post a Comment