తాజా వార్తలు

Sunday, 20 September 2015

అక్టోబర్ 9న రుద్రమదేవి

 ‘రుద్రమదేవి’ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ చివరకు అక్టోబర్ నెలకు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.  రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న అక్టోబర్ 9కే ఫిక్స్ చేసేశారు. భారతదేశపు మొట్టమొదటి 3డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళం, మళయాలం, హిందీ.. ఇలా నాలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లాన్ చేశారు. అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే విజువల్ ఫీస్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరిగిన జాప్యం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment