తాజా వార్తలు

Monday, 28 September 2015

పరువు నష్టం కింద 10 కోట్లు చెల్లించాలంట...!!!

వెండితెరపై మామా అల్లుళ్ల వార్ని చూశాం. అత్తతో అల్లుడు సరసం చూశాం. కానీ ఇది అంతకంటే మించినది. అంతకంటే రసవత్తరమైనది. ఓ రియల్ హీరో ఇంకో రియల్ హీరోతో పెట్టుకున్నాడు. ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఎన్నికల వేళ నువ్వా నేనా తేల్చుకుందాం అంటున్నాడు. ఇద్దరిమధ్యా వార్ నడుస్తోందిప్పుడు. అసలింతకీ ఈ రియల్ సినిమాలో హీరో ఎవరు?  హీరోకి రైవల్ ఎవరు?  తెలుసుకోవాలనుందా? ఎస్.. హీరో విశాల్ - స్టార్ ప్రొడ్యూసర్ కం హీరో శరత్ కుమార్ .. ఈ ఇద్దరి గురించే.

ప్రస్తుతం తమిళనాట నడిగర సంఘం ఎన్నికల వేడి మొదలైంది. విశాల్ -శరత్ కుమార్ రైవల్స్ గా పోటీ బరిలో ఉన్నారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు - ప్రత్యారోపణలతో రెచ్చిపోతున్నారు. ఓ సందర్భంలో విశాల్ చేసిన కామెంట్స్ శరత్ కుమార్ ని తీవ్రంగా హర్ట్ చేశాయి. నడిగర సంఘంలో జమ అవ్వాల్సిన డబ్బు విషయమై లెక్కలు స్పష్టంగా లేవ్. ఓ నిర్మాతకు సంబంధించిన 10లక్షల కు లెక్క తేలలేదు అంటూ ఓ మీటింగ్ లో విశాల్ కామెంట్ చేశాడని అది పరువు తీసేలా ఉందని శరత్ కుమార్ సీరియస్ అయ్యారు.

నీపై క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించాడు. ఇప్పటికే విశాల్ కి కోర్ట్ నోటీసులు పంపించాడు. వచ్చి సారీ చెప్పుకో. బతిమాలుకో లేకపోతే క్రిమినల్ కేసు పెడతా. పరువు నష్టం కింద 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఈ రచ్చ ఎన్నికలు పూర్తయ్యేవరకూ కొనసాగుతుంది.  విశాల్ నుంచి రిప్లయ్ ఎలా ఉంటుందో చూడాలి.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment