తాజా వార్తలు

Saturday, 19 September 2015

ఫస్ట్ క్లాస్ చిన్నారిని చితకబాదిన టీచర్

మెదక్ జిల్లాలో ఓ గురువు పైశాచికత్వానికి చిన్నారి తీవ్రగాయాలయ్యాయి. పటాన్ చెరు లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో హోం వర్క్ సరిగా చేయలేదనే కారణంతో ఒకటో తరగతి విద్యార్థిని యోగితశ్రీపై వీనస్ అనే టీచర్ మానవత్వం మరచి ప్రవర్తించింది. కట్టెతో చితకబాదింది. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment