తాజా వార్తలు

Wednesday, 2 September 2015

పాఠశాలలో ఘర్షణ విద్యార్థి మృతి

ర్యాగింగ్ భూతం పాఠశాలకు పాకింది. విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఆబిడ్స్ లోని సెయింట్ జోసెఫ్ స్కూళ్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం గొడవ పడ్డారు. ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సిద్ధిఖీ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన టీచర్ గొడవను వారించడానికి వెళ్లారు. అయితే అప్పటికే ఇద్దరు త్రీవంగా కొట్టుకున్నారు. దీంతో సిద్ధిఖీ అనే విద్యార్థి టీచర్ వడిలో కుప్పకూలిపోయాడు. అతన్ని కింగ్ కోఠి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు డీసీపీ కమలహాసన్ రెడ్డి తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment