తాజా వార్తలు

Tuesday, 8 September 2015

షార్క్ ను కాపాడేందుకు కదిలిన యువత

మసాచుసెట్స్, కేప్ కోడ్ సమీపంలోని వెల్ ఫ్లీట్ సముద్ర తీరంలోకి ఓ తెల్ల షార్క్ అలలకు కొట్టుకొచ్చింది. ఇసుకలో ఈదలేక అది ఒడ్డున పడి ఉంది. ఇది గమనించిన కొందరు యువతీ, యువకులు షార్క్ చుట్టూ ఇసుక గొయ్యి తవ్వారు. అందులో బకెట్ల కొద్దీ నీళ్లు పోశారు. తర్వాత ఆ గొయ్యి నుంచి సముద్రం నీటి వరకు పొడవాటి ఇసుక వంతెన నిర్మించారు. ఇందుకోసం మూడు గంటలకు పైగా శ్రమించారు. ఈ సమయంలో నాలుగు మీటర్ల చేప వేడెక్కిపోకుండా దాన్ని కాపాడేందుకు దానిపై నీళ్లు పోస్తూనే ఉన్నారు. మొత్తానికి షార్క్ కదిలింది. ఇసుక వంతెనలో ఉన్న నీటిపై ఈదుతూ సముద్రం దాకా వెళ్లింది. ఐతే అప్పటికే అది నీరసించిపోవడంతో చనిపోయింది.
« PREV
NEXT »

No comments

Post a Comment