తాజా వార్తలు

Wednesday, 23 September 2015

రాజన్నకు మరణం లేదు..!

మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డికి మరణం లేదని...తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని షర్మిల అన్నారు. పరామర్శయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా, కాటారం మండలం, గారేపల్లి చౌరస్తాలో ప్రజలనుద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు. ప్రజల బాధను తనదిగా భావించి ప్రతిఒక్కరికీ మేలు చేయడం వల్లే రాజశేఖర్ రెడ్డి...రాజన్న అయ్యారని పేర్కొన్నారు. 
వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది. షర్మిల యాత్రకు  జిల్లాలో అపూర్వ స్పందన వచ్చింది. రాజన్న బిడ్డను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరించారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ షర్మిల జిల్లాలో పరామర్శయాత్ర కొనసాగించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యుల్లో భరోసా కల్పించేందుకు.... జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 12 రోజుల పాటు పర్యటించి 73 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment