తాజా వార్తలు

Tuesday, 22 September 2015

మంచిరోజులు వస్తాయి- షర్మిళ

వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిళ చివరి విడత పరామర్శ యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. తొలుత పాలంపేటలో ఫహీముద్దీన్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. మళ్లీ మంచిరోజులు వస్తాయని... ఏఇబ్బంది వచ్చినా మేమున్నామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యులకు షర్మిల భరోసానిచ్చారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని ధైర్యం నింపారు.   మహానేత మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే ఎక్కువ మంది చనిపోయారు. మృతుల కుటుం బాలకు అండగా ఉంటానంటూ కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబ ప్రతినిధిగా షర్మిల వరంగల్ జిల్లాలో ఆగస్టు 24-28 మధ్య 32 కుటుంబాలను, సెప్టెం బర్ 7-11 మధ్య 30 కుటుంబాలను పరామర్శించారు. సోమవారం నుంచి చివరి దశలో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11 కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం మంగళవారం సాయంత్రం యాత్ర కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. వైఎస్ మృతిని తట్టుకోలేక జిల్లాలో 30 మంది మరణించారు. 
 మంగళవారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించిన అనంతరం వరంగల్ జిల్లాలో యూత్ర ముగించుకుని సాయంత్రం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. కాటారం మండలం బొర్లగూడెంలో ఎ. రామయ్య కుటుంబాన్ని పరామర్శించి రాత్రి కాటారంలో బస చేస్తారు. బుధవారం ఆరు కుటుంబాలను పరామర్శించి రాత్రి ధర్మారంలో బసచేస్తారు. 24న గురువారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించి రాత్రి హైదరాబాద్ పయనమవుతారు. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 371 కి.మీ. మేర యూత్ర జరగనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment