తాజా వార్తలు

Tuesday, 8 September 2015

షీ క్యాబ్స్ ను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్  ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో షి క్యాబ్స్ ను మంత్రి మహేందర్ రెడ్డి గ్రాండ్ గా ప్రారంభించారు.   తొలి దశలో భాగంగా 10మంది మహిళలకు క్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల భద్రతను కట్టుదిట్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక్కో క్యాబ్ ఖరీదు రూ.8లక్షల 15వేలు కాగా అందులో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా..55 శాతం బ్యాంకు ద్వారా మరో 10 శాతం మహిళా క్యాబ్ డ్రైవర్లు భరించాల్సి ఉంటుంది. తొలి దశలో ఎంపికైన 10 మందికి మాత్రం ఈ 10 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించింది. కార్యక్రమంలో నగర కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ తోపాటు షి టీమ్ ఇన్ చార్జ్ స్వాతిలక్రా పాల్గొన్నారు. . 
« PREV
NEXT »

No comments

Post a Comment