తాజా వార్తలు

Sunday, 6 September 2015

సిరియా శరణార్థులకు అండగా యూరప్ దేశాల

ఆస్ట్రియా, జర్మనీ దేశాలు శనివారం అధికారికంగా సిరియా, సెర్బియా శరణార్థులకు ద్వారాలు తెరిచాయి. సెర్బియా నుంచి వేల సంఖ్యలో వచ్చి హంగెరీలో చిక్కుకుపోయిన వారిని జర్మనీ, ఆస్ట్రియాలకు తరలించారు. కొన్ని వారాలుగా హంగెరీలోని తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్న శరణార్థులు జర్మనీ వెళ్లేందుకు ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసింది. అయితే సాయంత్రానికే బస్సు సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. రాజధాని నగరం బుడాపెస్ట్‌లోని రైల్వేస్టేషన్ నుంచి కూడా శరణార్థులను ఖాళీ చేసిన కొద్దిసేపటికే మళ్లీ కొత్తవారు వచ్చి దిగుతున్నారని అధికారులు చెప్పారు.
దీంతో పశ్చిమ యూరోప్ దేశాలకు వెళ్లే రైళ్లను రద్దు చేశారు. అయినప్పటికీ చాలా మంది కాలినడకనే ఆస్ట్రియాకు బయల్దేరారు. ఈ ఏడాది 8 లక్షల మందిని చేర్చుకుంటామని జర్మనీ ప్రకటించింది. మరోవైపు సరిహద్దుల నుంచి ఐదువేల మంది తమ దేశంలో ప్రవేశించారని ఆస్ట్రియా పోలీసులు చెప్పారు. మరికొంతమంది రైళ్లలో ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. శరణార్థులను చేర్చుకునేందుకు ఆశ్రయ నిబంధనలను సడలిస్తున్నామని ఆస్ట్రియా తెలిపింది.
టర్కీ తీరంలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన మూడేండ్ల సిరియా బాలుడు అయలన్ కుర్దీ మృతదేహం చిత్రాలు మీడియాలో రావడంతో ఐరోపా దేశాలపై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. సరిహద్దుల్లో నానాటికీ పెరిగిపోతున్న శరణార్థుల సంక్షోభాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక ఐరోపా యూనియన్ దేశాల్లో గందరగోళం నెలకొంది. గంటకు వంద మంది చొప్పున శరణార్థులు ఐరోపా దేశాలకు చేరుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment