తాజా వార్తలు

Saturday, 19 September 2015

స్మార్ట్‌ఫోన్‌లోని డేటా,ఫొటోలు అంతా డిలీట్‌ అయ్యాయా....డోంట్‌ వర్రీ!


ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లోని ఫొటోలు డిలీట్‌ అయ్యాయా..డేటా అంతా కానరాకుండా పోయిందా..? డోంట్‌ వర్రీ! కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. కానీ ఒక షరతు.. వెంటనే స్పందిస్తేనే అది సాధ్యం. డిలీట్‌ అయిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి రైట్‌ అవుతుంది కాబట్టి వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ డేటా రికవరీ టూల్‌ను ఉపయోగిస్తే పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందొచ్చు. అందుకు ఏం చేయాలంటే…
– ముందుగా మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని డేటా డిలీట్‌ అయిన తర్వాత ఏదైనా కొత్త డేటాను యాడ్‌ చేయటం గానీ, డిలీట్‌ చేయటం గానీ చేయకూడదు. ఎందుకుంటే డేటా రికవరీ టూల్‌ కొంత మెమరీని మాత్రమే రికవర్‌ చేయగలుగుతుంది.
– ఆ తర్వాత ఆండ్రాయిడ్‌ డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేయండి.
– అనంతరం పీసీలో ప్రోగ్రామ్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత యూఎస్బీ కేబుల్‌ సహాయంతో ఆండ్రాయిడ్‌ డివైస్‌ను పీసీకి కనెక్ట్‌ చేయండి.
– ఇన్‌స్టాలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్‌ సహాయంతో పీసీకి కనెక్ట్‌ చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లో యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్‌ చేయండి (Enable The Usb Debugging)ఇలా చేయటానికి మీరు ఫోన్‌ ప్రధాన సెట్టింగ్స్‌లోని డెవలపర్‌ ఆప్షన్స్‌ను యాక్సెస్‌ చేసుకోవల్సి ఉంటుంది. డీబగ్గింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే మీ డివైస్‌ డిటెక్‌ అవుతుంది.
– లేటెస్ట్‌ వర్షన్‌ ఆండ్రాయిడ్‌ డేటా రికవరీ టూల్‌ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. కాబట్టి మీరు ఎలాంటి ఫైల్స్‌ ను రికవర్‌ చేయాలనుకుంటున్నారో సెలక్ట్‌ చేసుకుని Next బటన్‌ పై క్లిక్‌ చేయండి. ఒకవేళ డిలీట్‌ అయిన మొత్తం డేటాను రికవర్‌ చేయదలచుకుంటే Select all పై టిక్‌ మార్క్‌ చేసి Next బటన్‌ పై క్లిక్‌ చేయండి.
– ఆ తర్వాత ఓపెన్‌ అయ్యే విండోలో స్కాన్‌ మోడ్‌ను సెలక్ట్‌ చేసుకుని Next బటన్‌ పై క్లిక్‌ చేయండి. మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మెమరీని స్కాన్‌కు సిద్ధమవుతుంది. స్కాన్‌ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫోన్‌లో రికవర్‌ కాబడిన డేటా, ప్రివ్యూ రూపంలో డెస్క్‌టాప్‌ పై మీకు కనిపిస్తుంది.
– వాటిలో మీకు అవసరమైన ఫోల్డర్‌ను సెలక్ట్‌ చేసుకుని రికవర్‌ యాక్షన్‌ పై క్లిక్‌ చేసినట్లయితే సంబంధిత ఫోల్డర్‌ మీ పీసిలోకి సేవ్‌ కాబడుతుంది. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో పోగొట్టుకున్న ఎస్‌ఎంఎస్‌లను రికవర్‌ చేసుకోవచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment