తాజా వార్తలు

Tuesday, 8 September 2015

మోడీ సర్కార్ పై సోనియాగాంధీ ఫైర్

 
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి ఫైరయ్యారు. C.W.C సమావేశంలో మాట్లాడిన సోనియా మోడీ సర్కార్ ను టార్గెట్ చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని…ధరలు వీపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు సోనియాను మరో ఏడాది పాటు ఏఐసీసీ అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకొని బీజేపీని గెలిపిస్తే సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. భూ సేకరణ బిల్లు ద్వారా రైతులకు నష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కాంగ్రెస్ పోరాటం వల్లే ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా రాహుల్ ఈ అంశంలో చేసిన ప్రచారంతో కేంద్రం హడలి పోయిందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment