తాజా వార్తలు

Thursday, 17 September 2015

నేతాజీ రహస్య ఫైళ్లు విడుదల

అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య ఫైళ్లు, బోస్ జీవితానికి సంబంధించిన 64 రహస్య ఫైళ్లను బెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసింది. మొత్తం 64 ఫైళ్లలో 12 వేల 744 పేజీలు ఉన్నాయన్న అధికారులు.. వాటన్నింటిని డిజిటలైజ్ చేయిస్తామని చెప్పారు. ముందుగా నేతాజీ కుటుంబసభ్యులకు ఫైళ్లను అందజేశారు. ప్రజల సందర్శనార్థం కోల్‌కతా పోలీస్ మ్యూజియంలో ఫైళ్లను పెట్టారు. వచ్చే సోమవారం నుంచి ప్రజలందరికీ ఫైల్స్ చూసే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment