తాజా వార్తలు

Saturday, 26 September 2015

సుబ్రమణ్యం ఫర్ సేల్ రివ్యూ

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన మూడో చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. హరీష్ శంకర్ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదలైంది.   నటుడిగా ఇప్పుడే అడుగులేస్తున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చెయ్యడానికి ట్రై చేసాడని చెప్పాలి. చేసిన కూడా అవి కావాలని చేసినవి కాకపోవడం తో  ఆ సీన్స్ బాగానే పండాయి. ముఖ్యంగా తన ఇంట్రడక్షన్ సీన్ లో పవన్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్ తో విజిల్ వేయించాడు. అలాగే డాన్సుల్లో దుమ్ములేపేసాడు.   రెజీన ఈ సినిమాకి ఒక మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.

సినిమా కథలోకి వెళితే...ప్రతి పనికి ఓ రేట్ కట్టి అమెరికన్ డాలర్స్ ని బాగా సంపాదించి ఇండియా లో కాలర్ ఎగరేసుకోవాలనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి సాయి ధరం తేజ్. ఓ సరికొత్త ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటాడు. అదే తనని తాను అమ్ముకోవడం.. తనకి ఏ పని చెప్పినా చెయ్యడానికి సిద్దం కానీ అది చెయ్యాలంటే దానికి తగ్గా డాలర్ రేటు తనకివ్వాలి. అలా ఇస్తే ఏదైనా చేయగలడు. ఓ రోజు ప్రేమలో పడి ఒకడి చేతిలో మోసపోయిన రెజీన  కనపడుతుంది. ఆమెను కాపాడి తన ఇంటికి తీసుకొస్తాడు. అలా ఇద్దరి మద్య ప్రేమ గా  మారుతున్న సమయంలో  సీత తన చెల్లి తేజస్వి పెళ్లి కోసం కర్నూల్ వెళ్ళాల్సి వస్తుంది. తనకి తోడుగా సుబ్రమణ్యం ని కూడా తీసుకెళ్ళుతుంది.  సీత ఫ్యామిలీ తో ఎప్పటినుండో పగను పెంచుకున్న  రావు రమేష్  సీతను కిడ్నాప్ చేయాలనీ ప్రయత్నం చేస్తాడు. మరో వైపు హైదరాబాద్ లో రౌడి అయిన  అజయ్  కూడా సుబ్బు కోసం వెతుకుతూ ఉంటాడు.  అసలు వీరిద్దరూ ఆ ఇద్దరికోసం ఎందుకు వెతుకుతున్నారు. అసలు సీతకు బియ్యం బుజ్జి కి గల సంబంధం ఏమిటి ? గోవింద్ గౌడ్ తో సుబ్బుకు గల పగ ఏమిటి ? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. 
  
« PREV
NEXT »

No comments

Post a Comment