తాజా వార్తలు

Tuesday, 8 September 2015

సన్నీ లియోన్‌ నే థ్రిల్ చేసాడంటా...!
సన్నీ లియోన్‌ నర్తించే ఓ పాటలో 400 వింటేజ్‌ (పాత కాలం నాటి) కార్లు, సూపర్‌ బైక్‌లను ఉపయోగించారు. ఇదేదో బాలీవుడ్‌ సినిమా కోసం అనుకునేరు. కాదు, ఓ కన్నడ సినిమా కోసం! ఆ సినిమా పేరు ‘లవ్‌ యు అలియా’. ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘కామాక్షి’ అంటూ సాగే ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. దీనిని దక్షిణాదిలోని అత్యంత ఖరీదైన పాటల్లో ఒకటిగా ఇంద్రజిత్‌ చెబుతున్నాడు.
బెంగళూరులో 400 వింటేజ్‌ కార్లు, సూపర్‌ బైకులు ఉపయోగించి సన్నీపై ఈ పాటను చిత్రీకరించారు. ‘‘పాత కార్లను సేకరించే నా స్నేహితుడి దగ్గర్నుంచి వాటిని తీసుకొని నా పాటకు ఉపయోగించుకున్నా. వాటిని చూసి సన్నీ థ్రిల్లయ్యింది. ఈ పాటను ఆమెతోనే తియ్యాలనే ఉద్దేశంతో తన కాల్షీట్ల కోసం మూడు నెల్లపాటు వేచిచూశాను. ఆమె దృక్పథం, సహకారం, సమయపాలన చూసి చాలా ఆనందపడ్డాం’’ అని తెలిపాడు ఇంద్రజిత్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment