తాజా వార్తలు

Saturday, 19 September 2015

షారుఖ్ ఖాన్ కీ - మహేష్ బాబుకీ మధ్య దోస్తీ కుదిరిందన్నమాట....!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిన్న `బ్రహ్మోత్సవం` సెట్ లో ప్రత్యక్షమై ఆ యూనిట్కి షాక్ నిచ్చిన సంగతి తెలిసిందే. అంత పెద్ద సూపర్ స్టార్ ఏమాత్రం భేషజాలు లేకుండా వేరొక సెట్ ని సందర్శించడం నిజంగా గ్రేటే. `బ్రహ్మోత్సవం` యూనిట్ సభ్యులంతా షారుఖ్ రాకని చూసి  థ్రిల్లయ్యారట.  మహేష్ కి కూడా షారుఖ్ తన సెట్ ని సందర్శించడం చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే ట్విట్టర్ లో ఆయనకి కృతజ్ఞతలు చెప్పాడు. మహేష్ ట్వీట్ ని చూసి షారుఖ్ ఖాన్ కూడా వెంటనే స్పందించాడు. `బ్రహ్మోత్సవం` సెట్ ని సందర్శించడం స్వతహాగా నాకు చాలా సంతోషాన్నిచ్చిందని రిప్లై ఇచ్చాడు. మీ యూనిట్ స్వాగతించిన విధానం చాలా బాగుందని మెచ్చుకొన్నాడు. త్వరలోనే మరోసారి కలుస్తాననీ అప్పుడు ఇద్దరం కలిసి హైదరాబాదీ రుచులు ఆస్వాదిద్దాం అన్నాడు షారుఖ్. 
  1. It was a pleasure meeting on our Brahmotsavam sets today. The entire cast and crew were thrilled.. Thanks Sir.. Humbled :)
  2. it was my pleasure actually. And ur crew was so warm and welcoming. Will drop in again and have some Hyderabadi food with u.
  3.   retweeted
    Done sir.. Ur always welcome.. Looking forward :)
మహేష్ కూడా `తప్పకుండా సార్... ఆ రోజు గురించి ఎదురు చూస్తుంటా` అని రిప్లై ఇచ్చాడు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేంటంటే... షారుఖ్ - మహేష్ అతి త్వరలోనే కలుసుకోబోతున్నారని.  కలుస్తానని కలిసి భోజనం చేస్తానని  మాటిచ్చాడు కాబట్టి షారుఖ్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మహేష్ తో కలుస్తాడని ఫిక్సయిపోవచ్చు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో అంటూ మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ కథానాయకులతో మన హీరోలకు మంచి స్నేహసంబంధాలున్నాయి. అభిషేక్ బచ్చన్ కీ రానాకీ మధ్య మంచి దోస్తీ ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి నటించారు కూడా. అలాగే రామ్ చరణ్ కీ సల్మాన్ ఖాన్ కీ మధ్య స్నేహం ఉంది. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రామ్ చరణ్ ని తప్పకుండా కలుస్తాడు. చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ ని తప్పకుండా మీటవుతాడు. చరణ్ హిందీలో సినిమా చేస్తున్నప్పుడు  సల్మాన్ తన ఇంటి నుంచి క్యారియర్ పంపించేవాడు. సల్మాన్ హైదరాబాద్ వచ్చినా చరణ్ ఇంటి నుంచి భోజనం  వెళుతుంటుంది.అలా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కీ - మహేష్ బాబుకీ మధ్య దోస్తీ కుదిరిందన్నమాట. అన్నట్టు మహేష్ కూతురు సితారతోనూ నిన్న షారుఖ్ చాలాసేపు ఆడుకొన్నాడట
« PREV
NEXT »

No comments

Post a Comment