తాజా వార్తలు

Tuesday, 8 September 2015

వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థిత్వాన్ని బీజేపీకి వదిలిపెట్టడానికి సై అంటున్న తెలుగుదేశం నేతలు...!

తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఒకదాన్నిఒకటి తిట్టుకొట్టుంటే సమ్మగా ఉంది తెలంగాణ తెలుగుదేశం విభాగానికి. మొన్నటి వరకూ ఈ పార్టీలు రెండూ ఎక్కడ ఒక్కటవుతాయో అని భయపడిన తెలుగుదేశం నేతలకు ఇప్పుడు లోలోపల జరిగిన అంతర్గత పరిణామాలు ఆనందదాయకంగా మారాయి. ఎప్పుడెప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములమవుదామా... అని భారతీయ జనతా పార్టీ నేతలను తెగ ప్రశంసిస్తూ వచ్చారు గులాబీ పార్టీ వాళ్లు. కవితమ్మకు కేంద్ర మంత్రి పదవి లెక్కలతో.. కేసీఆర్ స్థాయిలో ఇందుకు సంబంధించి మంత్రాంగం నడించింది. అయితే... ఆ ఆశలు నెరవేరలేదు. భారతీయ జనతా పార్టీతో స్నేహం కోసం చేసిన యత్నాలు ఏవీ ఫలించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి వారు ఇప్పుడు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. స్వయంగా కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు అన్యాయం చేస్తోందని అనడంతో.. ఎన్డీయేలో చేరాలన్న తెరాస కలలకు తెరపడిందని అప్పుడే స్పష్టం అయ్యింది.  ఇప్పుడు ఇరు వర్గాలూ దుమ్మెత్తిపోసుకొంటున్నాయి. దీంతో తెలుగుదేశం హ్యాపీ అయ్యింది. ఒకవేళ తెరాస గనుక ఎన్డీయేలో భాగస్వామి అయ్యుంటే తెలుగుదేశం పార్టీ తెగ ఫీలవ్వాల్సి వచ్చేది. ఇప్పటికే తెలంగాణలో తమను అనేక రకాలుగా అణగదొక్కుతున్న తెరాస కేంద్రంలో కూడా అధికార భాగస్వామి అయితే.. అది తెలంగాణ తెలుగుదేశం నేతలకు పీడకలగా మారేది. అయితే ప్రస్తుతానికి అది జరగదని స్పష్టం అవుతోంది. దీంతో తెలుగుదేశం నేతలు హ్యాపీ గా ఉన్నారు. ఇదే మూడ్ లో వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీకి వదిలిపెట్టడానికి తెలుగుదేశం నేతలు సై అంటున్నారు!
« PREV
NEXT »

No comments

Post a Comment