తాజా వార్తలు

Saturday, 12 September 2015

తెలుగుదేశం పార్టీ కొంప ముంచనున్న భాజపా...!
పక్కల్లో బల్లేన్ని కాదు.. పక్కలో తనను కబళించేసే శతృవును పెట్టుకుని ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలను కొనసాగిస్తున్నదా? 2019 నాటికి తెలుగుదేశానికి ప్రధానమైన ఇబ్బంది.. ఎదురుదెబ్బ భారతీయ జనతా పార్టీనుంచే తగులుతుందా? ప్రస్తుతం కాంగ్రెస్‌ పతనం అయిపోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసి.. తమ పార్టీ ప్రాబల్యం పెంచుకోవాలని అనుకుంటున్న భాజపా.. ఈ నాలుగేళ్ల కృషితో.. వచ్చే ఎన్నికల నాటికే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చేగలమని నమ్ముతున్నదా...? పరిస్థితుల్ని పరిశీలిస్తే అలాగే అనిపిస్తోంది.  ఈవిషయాన్ని, తెలుగుదేశాన్ని మట్టుపెట్టి తాము గద్దె ఎక్కాలనుకుంటున్న కోరికను భాజపా నాయకులు ఎంతమాత్రమూ దాచుకోవడం లేదు. బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయవాడలో ముద్ర యోజన గురించి.. ప్రచారం చేయడానికి భాజపా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర నౌకాయాన ఉపరితల రవాణా సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ఏపీలో భాజపా అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేయడం విశేషం.  ఇప్పటికే.. రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు.. వచ్చే ఎన్నికల్లో బహుశా తాము తెలుగుదేశంతో పొత్తులు లేకుండా పోటీచేయాల్సి వచ్చే పరిస్థితులకు సన్నద్ధంగా ఉండాలని ఇప్పటినుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల్లో నియోజకవర్గాల్లో అక్కడక్కడ భాజపా బలంగా ఉన్నచోట పార్టీ నాయకులు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారే తప్ప.. తెదేపా ఎమ్మెల్యేలకు లోబడి ఉన్నట్లుగా ప్రజల దృష్టిలో కనిపించడం లేదు. ఇలాంటి పరిణామాలు అన్నిటినీ కలిపి బేరీజు వేసినప్పుడు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశాన్ని కూడా దెబ్బకొట్టి తామే గద్దెమీద కూర్చునే పరిస్థితి వస్తుందని కమల నాధులు గట్టి ఆశతోనే ప్రొసీడ్‌ అవుతున్నారని అనిపిస్తోంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment