తాజా వార్తలు

Wednesday, 23 September 2015

అసెంబ్లీ ఈ నెల 29కి వాయిదా

 రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి అసెంబ్లీ ఉభయసభలు నేడు సంతాపం తెలిపాయి. సమావేశాలు ప్రారంభమైన అనంతరం సీఎం కేసీఆర్ శాసనసభలో కలాం మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు పార్టీల సభ్యులు తమ స్పందనలు తెలియజేశారు.  ఇటీవల మృతిచెందిన మాజీరాష్ట్రపతి అబ్దుల్ కలాం, మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు ఉభయ సభలు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించాయి. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలకు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అనంతరం సభాపతి మధుసూదానాచారి శాసనసభ సమావేశాలను ఈ నెల 29కి వాయిదా వేశారు.
శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశం ముగిసింది. సమావేశానికి సీఎం కేసీఆర్, విపక్షనేత జానారెడ్డితో సహా వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం, మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతికి ఉభయసభలు నివాళి అర్పించాయి. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29కి వాయిదా పడ్డాయి. 
 బీఏసీలో నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి వచ్చేనెల 10 వరకు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాల నిర్వహణ. 29న రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల అనంతరమే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టనున్నారు. అక్టోబర్ 2, 3, 4న అసెంబ్లీకి సెలవు.
« PREV
NEXT »

No comments

Post a Comment