తాజా వార్తలు

Wednesday, 9 September 2015

అనుష్క కన్నా గొప్పపాత్రలు చేస్తున్న త్రిష...!త్రిష..మంచి ఫెర్ ఫార్మర్. గ్లామర్ పాత్రల్లో కూడా తనదైన ముద్రవేయగలదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న తాజా సినిమా నాయకి పోస్టర్ బయటకు వచ్చింది. ఒక పక్క గ్రేసీ లుక్స్ తో కనిపిస్తూనే, మరోపక్క చేతిలో రక్తం ఓడే కత్తితో భయపెడుతోంది త్రిష. ఆ సూపర్ లుక్స్ ఏమిటో..చేతిలో ఆ నెత్తురోడే కత్తి ఏమిటో..పైగా  షి వాచ్..అండ్ కాచ్ యు అంటూ భయపెట్టే ఆ క్యాప్షన్ ఏమిటో. కాస్త ఆసక్తిగానే వుంది వ్యవహారం,.  ఉభయ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాకు గోవర్థన్ దర్శకుడు. త్రిష మేనేజర్ గిరిధర్ నిర్మాత. 70 దశకం బ్యాక్ డ్రాప్ తో పక్కా రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథ వుంటుందని తెలుస్తోంది. ఆద్యంతం గ్రిప్పింగ్ నడిచే ఈ స్క్రిప్ట్ పై త్రిష బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కాకుండా మరో హర్రర్ సినిమాలో కూడా త్రిష నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తనలోని నటిని బాగా ఎలివేట్ చేస్తాయని ఆమె చాలా నమ్మకంగా వుంది.
ఇది అంతా చూస్తే  త్రిష.అనుష్క కన్నా గొప్ప పాత్రలు చేస్తున్నది  నమాట....!
« PREV
NEXT »

No comments

Post a Comment