తాజా వార్తలు

Friday, 4 September 2015

గుడంబా తాగించింది కాంగ్రెస్, టీడీపీలే- టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు

టీడీపీ, కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్ తెలిపారు. కరెంట్ ఛార్జీల పెంపును ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబ్కారీ విధానంతో గుడుంబా తాగించి ప్రజల జీవితాలను నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. గుడుంబాను మాన్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని  ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. గుడుంబాకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment