తాజా వార్తలు

Monday, 28 September 2015

తెలంగాణలో త్వరలో కొత్తజిల్లాలు

తెలంగాణ రాష్ర్టంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చైర్మన్ గా సర్కారు కమిటీని నియమించింది. జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన, కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రెవిన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ కమిషనర్ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. వీరితో మరో ఎనిమిది శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కూడా అవసరాన్ని బట్టి ఆహ్వానిస్తారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment