తాజా వార్తలు

Tuesday, 15 September 2015

టాప్-200లో మన యూనివర్సిటీలకు చోటు!భారత్‌కు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు అరుదైన ఘనత సాధించాయి. ప్రపంచంలోని రెండు వందల అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో తొలిసారిగా మన విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టాప్-200 యూనివర్సిటీల లిస్టులో చేరాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఈ జాబితాలో 147వ ర్యాంకు దక్కించుకోగా, ఐఐటీ ఢిల్లీ 179వ స్థానం సొంతం చేసుకుంది.
 
ఈ జాబితాలో ది మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ) అగ్రస్థానం కైవసం చేసుకుంది. దీని తర్వాతి స్థానంలో హార్వార్డ్ యూనివర్సిటీ నిలిచింది. కాగా, మూడో స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా కొనసాగుతున్నాయి. ఇక, ప్రపంచంలోని టాప్-50 అత్యుత్తమ యూనివర్సిటీల్లో నాలుగు లండన్ నగరంలోనే ఉండడం గమనార్హం. ఆ జాబితాలో బోస్టన్ (3), న్యూయార్క్ (3) తర్వాతి స్థానంలో ఉన్నాయి. పారిస్, సిడ్నీ, హాంకాంగ్, బీజింగ్ నగరాల్లో రెండేసి ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలున్నాయి. కాగా, ఈ జాబితాను క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సంస్థ ప్రకటించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment