తాజా వార్తలు

Monday, 28 September 2015

ఆహార వ్యర్థాలపై యూఎన్ వో వినూత్న ప్రయోగం

ఆహార వ్యర్థాలు వృధా కావడంపై ఐక్యరాజ్యసమితి వినూత్న చర్యకు తెరలేపింది. ఈమేరకు యూఎన్‌వో జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో సహా 30 మంది ప్రపంచ దేశాధినేతలకు ఆహార వ్యర్థాలతో తయారు చేసిన శాఖాహారాన్ని లంచ్‌గా వడ్డించారు. లంచ్ అనంతరం నేతలు మాట్లాడుతూ.. మా లంచ్‌కు ఉపయోగపడకుంటే ఈ ఆహార వ్యర్థాలన్ని భూమిలోకి చేరిపోయేవని, తర్వాత మిథేన్ తదితర వాయువులను వాతావరణంలోకి కలిసేవని అన్నారు. ఈ ఆహరం అంతా సక్రమంగా వినయోగంలోకి వస్తే ప్రపంచంలో ఆకలే ఉండదని వివరించారు. ఈ ఆహార పధార్థాలన్ని పనికిరావని పారేయబోయిన కూరగాయలు, ఉత్పత్తులతో తయారు చేయించామని బాన్ కీ మూన్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు కీలకమని చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ప్రతీ యేటా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల టన్నుల ఆహారం వినియోగంలోకి రాకుండా పోవడం వ్యవస్థకు సిగ్గుచేటన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment