తాజా వార్తలు

Friday, 25 September 2015

30న ఛలో అసెంబ్లీ-వరవరరావు

వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 30న ఛలో అసెంబ్లీకి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపునిచ్చింది.  372 ప్రజా సంఘాలు, 10 వామపక్ష పార్టీలతో తెలంగాణ ప్రజాస్వామిక వేదికను ఏర్పాటు చేశారు. పాశవిక పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలందరూ తిరగబడాల్సిన అవసరం ఉందని విరసం నేత వరవరరావు అన్నారు. ఇందుకోసం ప్రజాస్వామిక వాదులంతా ముందుకు రావాలని ఆయనతో పాటు వామపక్షాల నేతలు, ప్రజాసంఘాల నాయకులు కోరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment