తాజా వార్తలు

Tuesday, 8 September 2015

ఏపీకి బిస్కెట్ దిగ్గజం...

బిస్కెట్ వ్యాపార రంగంలో అగ్రస్థానంలో ఉన్న బ్రిటానియా ఏపీకి రానుంది. దీనికి సంబంధించిన కీలక చర్చలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సదరు కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ చర్చలు జరిపారు. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల అవసరాల కోసం అనువైన ప్రాంతం కోసం తాము వెతుకుతున్నట్లు ఆయన చెప్పటం.. ఇందుకు పరిష్కారంగా చిత్తూరు జిల్లా పేరును బాబు ప్రతిపాదించటం జరిగింది.

చంద్రబాబు ప్రతిపాదించిన చిత్తూరు జిల్లాలో తమ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు బ్రిటానియా ఎండీ ఓకే చెప్పేసినట్లు చెబుతున్నారు. రూ.125కోట్లు పెట్టుబడి పెట్టనున్న సదరు కంపెనీ.. వచ్చే ఏడాది చివరి నుంచి తన ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

బిస్కెట్ వ్యాపారంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన బ్రిటానియా ఉత్పత్తుల్లో అత్యధిక భాగంగా బిస్కెట్లే. అవి కాకుండా కేక్స్.. డెయిరీ ఉత్పత్తులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో డెయిరీ ఉత్పత్తులకు అవకాశం ఉండటం.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న నేపథ్యంలో.. చిత్తూరుజిల్లా అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. మొత్తంగా బిస్కెట్ కింగ్ బ్రిటానియా ఏపీకి రావటం.. మంచివార్తగానే చెప్పొచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment